తెలంగాణ

telangana

Bhilai Steel Plant Female Officer Ruckus

ETV Bharat / videos

మహిళా అధికారి వీరంగం- సహోద్యోగుల తలపై కొడుతూ దారుణం- సీసీటీవీకి చిక్కి! - భిలాయ్ స్టీల్ మహిళ అధికారి గొడవ

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 7:42 PM IST

Bhilai Steel Plant Female Officer Fight :ఛత్తీస్​గఢ్​ దుర్గ్ జిల్లాలోనిభిలాయ్ స్టీల్ ప్లాంట్​లో మహిళా అధికారి వీరంగం సృష్టించారు. కంప్యూటర్లు, సీసీ కెమెరాలు పగలగొట్టి.. ట్రైనీవర్కర్ ఆస్తా సోనీ అనే మహిళను టిఫిన్‌ బాక్స్​తో తలపై కొట్టారు. అక్కడి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం.. పత్రాలపై నీళ్లు పోయడం వంటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

భిలాయ్ స్టీల్ ప్లాంట్ (బీఎస్‌పీ) అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయమైన ఇస్పాత్ భవనంలో.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్​గా (AGM) పని చేస్తున్న ప్రియాంక హోరో గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో గందరగోళం సృష్టించారు. మహిళా ట్రైనీవర్కర్ ఆస్తా సోనీని టిఫిన్‌ బాక్స్​తో తలపై కొట్టారు. కంప్యూటర్లు, సీసీ కెమెరాలు పగలగొట్టి, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. పలు పత్రాలపై నీళ్లు పోయడం వంటి పనులు చేశారు. మహిళా అధికారి చేసిన ఈ తతంగం మొత్తం దృశ్యాలు మరో సీసీటీవీలో రికార్డయ్యాయి.  

ఏజీఎంను సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు : మహిళా అధికారి ప్రియాంక చేసిన చర్యలకు నివ్వెరపోయిన ఉద్యోగులు బీఎస్‌పీ (భిలాయ్ స్టీల్ ప్లాంట్) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం గొడవ సృష్టించిన ప్రియాంకను బీఎస్‌పీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రియాంక హూరో 2021లో కూడా ఇలాగే గొడవపడ్డారు. అయితే ఆ సమయంలో బీఎస్‌పీ అధికారులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిబ్బంది చెబుతున్నారు. ప్రియాంక భర్త కూడా ఇక్కడే పనిచేస్తున్నారని.. కానీ ఆమె తన భర్తతో కలిసి ఉండడం లేదని తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తైన అనంతరం మహిళపై అధికారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details