Bhatti Vikramarka on Congress Manifesto 2023 : 'ప్రజల అజెండానే కాంగ్రెస్ మేనిఫెస్టో.. తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం' - తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
Published : Oct 12, 2023, 11:41 AM IST
|Updated : Oct 12, 2023, 12:35 PM IST
Bhatti Vikramarka on Congress Manifesto 2023 :అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయిందని.. త్వరలోనే ఏఐసీసీ అభ్యర్థుల్ని ప్రకటిస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కమ్యూనిస్టులతో పొత్తులు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని చెప్పారు. వారు కాంగ్రెస్ పార్టీ ముందుంచిన డిమాండ్లు, కోరిన అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ అధిష్ఠానానికి పూర్తి నివేదిక అందించామని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులతో.. కాంగ్రెస్ సిట్టింగుల్లో కొందరికి టికెట్ దక్కదంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని భట్టి క్లారిటీ ఇచ్చారు.
Bhatti Vikramarka on Congress MLA Tickets :కాంగ్రెస్ కోసం నిటారుగా నిలబడ్డ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్థానాన్ని ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామన్న భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పాలన కన్నా వంద రెట్లు కాంగ్రెస్ పాలన బాగుంటుందన్న భరోసా ప్రజలకు ఇస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. ప్రజల అజెండానే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉండబోతోందంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ముఖాముఖి.