'బీజేపీ, బీఆర్ఎస్లను ప్రజలు నమ్మేస్థితిలో లేరు.. నెక్ట్స్ మేమే అధికారంలోకి' - Telangana Congress latest news
Bhatti Vikramarka Interview: దేశంలో, రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో హస్తం పార్టీని బలోపేతం చేస్తూ.. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తామని వివరించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి కాకుండా విడిగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం ఏకపక్షం కాదని తెలిపారు.
రాష్ట్రంలో అన్నిచోట్ల ఒకేసారి యాత్రలు చేపట్టాలని పార్టీ నిర్ణయమని భట్టి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లను ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. అత్యంత బలమైన రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.