తెలంగాణ

telangana

Bhainsa BRS Leaders Resignation Today

ETV Bharat / videos

Bhainsa BRS Leaders Resignation : బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్​.. భైంసాలో 1000 మంది రాజీనామా - Who resigned from BRS in Bhainsa

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 8:43 PM IST

Bhainsa BRS Leaders Resignation : ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో అధికార పార్టీకి షాక్​ తగిలింది. ఓ నియోజకవర్గంలోని ప్రజానాయకులందరు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. నిర్మల్​ జిల్లాలోని భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్​ రాజేశ్​ బాబు(market committee chairman)తో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్​లు, సీనియర్ నాయకులు కారుకు గుడ్​ బై చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ నాయకులను కాదని ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి అనుకూలమైన వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజేష్ బాబుతో పాటు జడ్పీటీసీలు 2, ఎంపీపీ 1, సర్పంచ్​లు 10, ఎంపీటీసీ 8, మాజీ జడ్పీటీసీలు 3, మాజీ ఎంపీపీలు 3, మాజీ సర్పంచ్​లు, ఎంపీటీసీలు 60 మంది రాజీనామా చేశారు. అవసరమైతే తమ పదవులను వదులుకుంటామని స్పష్టం చేశారు. 

1000 BRS Leaders Resignation in Nirmal: సీనియర్ నాయకులతో పాటు పార్టీనీ వీడిన 1000 మంది కార్యకర్తలు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు వెల్లడించారు. ఎమ్మెల్యే తీరుపై పలుమార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిన.. ఎలాంటి మార్పు లేకపోవడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జరిగే ఎన్నికల్లో విఠల్ రెడ్డి(MLA Vittal Reddy)ని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. తమ భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే మరికొంత మంది రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details