Charminar Bonalu Drone Visuals : చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలు.. డ్రోన్ విజువల్స్ చూశారా..? - భాగ్యలక్ష్మి ఛార్మినార్ బోనాలు
Charminar Bhagyanagar Ammavari Bonalu Drone Visuals : హైదరాబాద్ పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చార్మినార్ వద్దకు అంబారీపై వచ్చిన అక్కన్న, మాదన్న మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపునకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జెండా ఊపి అమ్మవారి ఘటాల ఊరేగింపును ప్రారంభించారు. భారీ భాజాభజంత్రీలు, కళాకారుల బృందాల నడుమ అమ్మవారి ఘటాల ఊరేగింపు జరిగింది.
పాతబస్తీ హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమై.. లాల్‌దర్వాజ చౌరస్తా మీదుగా షాలిబండ, చార్మినార్, గుల్జార్‌హౌజ్ మీదుగా దిల్లీ దర్వాజ వరకు ఊరేగింపు సాగింది. ఈ ఉత్సవాలను చూసేందుకు చార్మినార్ వద్దకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఆ పరిసర ప్రాంతాలు ఎంతో సందడిగా.. కోలాహలంగా మారాయి. చార్మినార్ పరిసరాలను మొత్తం డ్రోన్లతో చిత్రీకరించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజే, డప్పుల సౌండ్స్‌తో చిన్నాపెద్దా అందరూ ఆనందంగా గడిపారు.