తెలంగాణ

telangana

ETV Bharat / videos

పోలీసుల దొంగపని.. గస్తీకి వచ్చి ఫ్యాన్ చోరీ.. చివరకు అడ్డంగా బుక్కై.. - పోలీసుల ఫ్యాన్ దొంగతనం

By

Published : Oct 2, 2022, 9:26 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

బిహార్ భాగల్​పుర్ జిల్లాలో పోలీసులే దొంగతనానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైట్ పెట్రోలింగ్​లో ఉన్న పోలీసులు.. వాహనాన్ని ఆపి ఓ ఇంటి ముందు ఉన్న టేబుల్ ఫ్యాన్​ను ఎత్తుకెళ్లారు. ఫ్యాన్​ను తీసుకొని వారు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సెప్టెంబర్ 26న అర్ధరాత్రి ధోల్​బాజా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సుబోధ్ చౌదరి.. తొలుత చుట్టుపక్కలవారిని అడిగాడు. అనంతరం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. దీంతో పోలీసు దొంగలు దొరికిపోయారు. దీనిపై ఆరా తీసేందుకు వెంటనే పోలీసుల వద్ద వెళ్లాడు సుబోధ్. అయితే, ముందుగా పోలీసులు బుకాయించారు. స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అయితే, సీసీటీవీ వీడియో చూయించాక.. పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఫ్యాన్​ను తిరిగి ఇచ్చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details