భద్రాచలంలో ఘనంగా రాపత్తు ఉత్సవాలు - శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునిగా దర్శనమిచ్చిన శ్రీరాముడు - రాపత్తు ఉత్సవాలు
Published : Jan 4, 2024, 8:33 PM IST
Bhadradri Rapathu Utsavam : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గురువారం సాయంత్రం రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారు తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునిగా భక్తులకు దర్శనమిచ్చారు. డిసెంబర్ 23 నుంచి జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు రోజుకు ఒక ప్రదేశం వద్దకు వెళ్లి వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Rapathu Utsavam in Bhadrachalam : ముందుగా వెంకటేశ్వర స్వామి అలంకరణలో ఉన్న స్వామి వారిని కల్పవృక్ష వాహనంపై కూర్చోపెట్టి ఊరేగింపుగా గోకుల రామం మండపం వద్దకు తీసుకువెళ్లారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఊరేగుతూ వెళ్లిన స్వామివారికి భక్తులు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారి పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న తొమ్మిది వందల ఎకరాల భూముల్లో గోకుల రామం మండపం వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.