తెలంగాణ

telangana

Fraud in Distribution Of Double Bedroom Houses

ETV Bharat / videos

Tension at appanagudem in Suryapeta : 'డబుల్​' ఇళ్ల కోసం ఆందోళన.. కళ్లల్లో కారం చల్లి దాడి.. - బాధితులు ఆందోళనలు

By

Published : Jun 18, 2023, 1:59 PM IST

Attack on Double Bedroom Victims in Suryapet :డబుల్ బెడ్​రూం ఇళ్లు ఆక్రమించుకున్న బాధితులపై లబ్ధిదారులు కళ్లల్లో కారం పోసి దాడికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం అప్పనగూడెంలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అప్పనగూడెం డబుల్ బెడ్​రూం ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ఇళ్లు రాని బాధితులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు కమీషన్లు తీసుకొని అనర్హులకు ఇళ్లను కేటాయించారంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందించినా పట్టించుకోవట్లేదని వాపోయారు.

ఈ క్రమంలోనే నేడు పలువురు బాధితులు డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లను ఆక్రమించుకున్నారు. దీంతో ఆగ్రహించిన లబ్ధిదారులు బాధితులతో ఘర్షణకు దిగారు. వారి కళ్లల్లో కారం చల్లి దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపమని బాధితులు ఇళ్ల ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగారు. న్యాయబద్ధంగా పేదలకు అందాల్సిన ఇళ్లను కమీషన్లకు ఆశపడి ఉన్నత వర్గాలకు అందించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details