తెలంగాణ

telangana

Bees Attack on Brs Mla Campaign Rally

ETV Bharat / videos

ఆలేరులో ప్రచారం నిర్వహిస్తుండగా తేనెటీగల దాడి బీఆర్​ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం - aleru latest news

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 4:46 PM IST

Bees Attack on BRS MLA Sunitha: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు భారత రాష్ట్ర సమితి.. పక్కా వ్యూహాలతో ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ తొమ్మిది సంవత్సరాల్లో చేసిన అభివృద్దిని వివరిస్తూ నాయకులు ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, సభలు, పాదయాత్రలుగా వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రచారం నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ప్రచార రథంపై ఉన్న ఆమె అప్రమత్తమై.. తన వాహనంలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. నాయకులు కండువాలు కప్పుకొని తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. కాసేపటి తర్వాత యధావిధిగా ప్రచారం కొనసాగించారు. తేనెటీగల దాడిలో ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details