తెలంగాణ

telangana

Bedurulanka_2012_Movie _Team

ETV Bharat / videos

Bedurulanka 2012 Movie Team in Narasapuram: నరసాపురంలో 'బెదురులంక 2012'.. ఇంజినీరింగ్​ విద్యార్థులతో సందడి - హీరోయిన్​ నేహా శెట్టి

By

Published : Aug 11, 2023, 9:29 AM IST

Bedurulanka 2012 Movie Team in Narasapuram: గోదావరి జిల్లాలతో తనకు మంచి అనుబంధం ఉందని హీరో కార్తికేయ అన్నారు. ఆయన హీరోగా, నేహాశెట్టి హీరోయిన్​గా నటించిన బెదురులంక 2012 సినిమా బృందం గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించింది. ఈ నెల 25న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా వారిరువురు చిత్ర యూనిట్​తో కలిసి సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్​ కళాశాలలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ప్రతి ఒక్కరూ థియేటర్​కు వచ్చి సినిమా చూడాలని కోరారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కార్తికేయ మాట్లాడారు. బెదురులంక టీజర్​, పాటలు ఇప్పటికే విడుదల చేశామని, వాటికి మంచి పేరు వచ్చిందన్నాపు. వంద శాతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని వెల్లడించారు. హీరోయిన్​ నేహాశెట్టి మాట్లాడుతూ.. ప్రేక్షకులందరూ సినిమా చూసి నవ్వుతూ థియేటర్​ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ సత్యనారాయణ, డైరెక్టర్​ అడ్డాల శ్రీహరి, కోశాధికారి త్రినాథ్​ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయాన్ని గురువారం రాత్రి హీరో, హీరోయిన్​దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details