తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎగువ నుంచి దూకుతున్న జలధారలు.. కనువిందు చేస్తున్న జలపాతాలు.. - మిట్ట జలపాతం

By

Published : Jul 11, 2022, 4:34 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

Water falls in lingapur: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లింగాపూర్ మండల కేంద్రంలోని సప్తగుండాల, మిట్ట, చింతల మదర జలపాతాలు కనులవిందు చేస్తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు వున్నందున జలపాతాల వద్ద జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు రక్షణ చర్యలు చేపట్టారు. జలపాతాల సందర్శనను తాత్కాలిక రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సప్త గుండాల జలపాతం వద్ద వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సందర్శనకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details