Batthini Harinath Goud Passes Away : చేపమందు పంపిణీ చేసే.. బత్తిని హరినాథ్‌గౌడ్ కన్నుమూత - Batthini Family Distributes Fish Medicine
Published : Aug 24, 2023, 8:36 PM IST
|Updated : Aug 24, 2023, 10:28 PM IST
Batthini Harinath Goud Dead in hyderabad : ఆస్తమా వ్యాధిగ్రస్థులకు చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని కుటుంబంలో విషాదం నెలకొంది. ఏటా మృగశిర కార్తెకు చేప మందు అందజేసే బత్తిన సోదరుల్లో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. హైదరాబాద్ కవాడిగూడలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
Batthini Family Distributes Fish Medicine : కరోనా విపత్తు వేళ బత్తిని హరినాథ్ గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడనా.. గత 25 రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి పరిస్థితి విషమించి.. హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. బత్తిన మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. బత్తిని అంత్యక్రియలు రేపు హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో జరగనున్నాయి. బత్తిని పంపిణీ చేసే చేపమందు కోసం పెద్ద సంఖ్యలో అస్తమా వ్యాధిగ్రస్తులు వచ్చేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి క్యూ కట్టేవారు.