తెలంగాణ

telangana

శునకంలా అరుస్తున్న జింక- కెమెరాకు చిక్కిన అరుదైన వన్యప్రాణి

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 10:19 AM IST

Barking deer

Barking Deer Video :ఛత్తీస్​గఢ్ అడవుల్లో అరుదైన మొరిగే జింక కెమెరాకు చిక్కింది. ధమ్​తరీ, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని ఉదంతి సీతానంది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​లో ఈ జింక కనిపించింది. ఇది అరుదైన వన్యప్రాణి అని టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ జైన్ తెలిపారు. శునకం మాదిరిగా అరుస్తూ శబ్దాలు చేసే ఈ జింక రెయిన్​ డీర్ జాతికి చెందినదని వివరించారు. సాధారణ జింకలతో పోలిస్తే దీని శరీరం కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పారు. 

మౌన్​జాక్ డీర్, ఇండియన్ కాకడ్, బార్కింగ్ డీర్ (మొరిగే జింక), కోట్రి వంటి వివిధ పేర్లతో దీన్ని పిలుస్తారని అరుణ్ జైన్ తెలిపారు. భారత్ సహా దక్షిణాసియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించారు. వాటిలో ఒక జాతికి చెందిన జింకలు భారత్​లోనూ కనిపిస్తాయి కాబట్టి, వాటికి ఇండియన్ కాకడ్ అనే పేరు వచ్చిందని వివరించారు. కెమెరా కంటికి చిక్కిన ఈ మొరిగే జింక వీడియోను ఉదంతి సీతానంది టైగర్ రిజర్వ్ తమ​ సోషల్ మీడియా హ్యాండిల్​లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

అసలే జ్వరం, ఆపై వీధికుక్క దాడి- ఆస్పత్రిలో తల్లీకొడుకులు!

తప్పిపోయిన పిల్ల ఏనుగు- డ్రోన్లు, అటవీ సిబ్బంది సాయంతో సేఫ్​గా తల్లి వద్దకు!

ABOUT THE AUTHOR

...view details