పట్టాలు తప్పిన ప్రయాణికుల రైలు పలువురికి గాయాలు - rail traffic stopped on Rajkiwas Bomadra section
రాజస్థాన్ పాలి జిల్లాలో ఓ రైలు పట్టాలు తప్పింది. బాంద్రా నుంచి జోద్పుర్కు వెళ్తున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్ పాలి రైల్వే స్టేషన్కు వచ్చే ముందు అదుపుతప్పింది. దీంతో సుమారు 12 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వాయువ్య రైల్వే సీపీఆర్ఓ తెలిపారు. ప్రమాదం అనంతరం ప్రయాణికులు రైలు దిగి పరిగెత్తారు. దీంతో తొక్కిసలాంటి పరిస్థితి ఏర్పడింది. ఘటన గురించి సమాచారం అందగానే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికుల కోసం జోద్పుర్ నుంచి మరో రైలును పంపించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST