Bandi Sanjay Speech In Adilabad Meeting : రాష్ట్రంలో పేదల ప్రభుత్వమే వస్తుంది : బండి సంజయ్ - ఆదిలాబాద్లో బండిసంజయ్ స్పీచ్
Published : Oct 10, 2023, 4:36 PM IST
Bandi Sanjay Speech In Adilabad Meeting : తెలంగాణలో పేదల రాజ్యం వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్ జన గర్జన సభలో మాట్లాడిన ఆయన... తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఆ అప్పును ఎలా తీరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పు కేవలం మోదీ వల్లనే తీరుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం అంటుంది.. వాళ్లు రాష్ట్ర అప్పును ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో యువత కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, డీఎస్సీ, గ్రూప్-1 ఇవన్ని కలగానే ఉంటాయని తెలిపారు. ఇవన్ని రావాలి.. తెలంగాణ బాగుపడాలి.. అంటే బీజేపీ రాజ్యమే రావాలని తెలిపారు.
Kishan Reddy Speech In Adilabad Public Meeting :కేంద్రంలోప్రధాని మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ధీమావ్యక్తం చేశారు. జన గర్జన సభలో ప్రసంగించిన ఆయన.. తెలంగాణ విమోచన ఉత్సవాలు మొదటిసారి అమిత్షా ఘనంగా జరిపించారని తెలిపారు. ఎన్నికల ప్రకటన తర్వాత తొలి సభ ఆదిలాబాద్లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనారోగ్య సమస్య కారణంగా ఆయన ఎక్కువ సేపు మాట్లాడలేక పోయారు.