తెలంగాణ

telangana

Bandi Sanjay

ETV Bharat / videos

Bandi Sanjay Interesting Comments : 'నన్ను భయపెట్టేందుకే.. అక్రమ కేసులు పెడుతున్నారు' - బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

By

Published : May 27, 2023, 5:42 PM IST

Bandi Sanjay Interesting Comments : భయపెట్టేందుకే తనపై అనేక అక్రమ కేసులు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అయినా వాటికి బెదరకుండా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్‌ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఐసీఏఐ ఆల్​ఇండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బండి సంజయ్‌ ధృవపత్రాలు ప్రదానం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు చార్టెడ్ అకౌంటెంట్​లు.. వెన్నుముక లాంటి వారని పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులకు నేడు పట్టాలు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు ఏ విషయానికి భయపడకుండా ముందుకు సాగాలని వెల్లడించారు. మరోవైపు రానున్న 20 ఏళ్లలో అభివృద్ధిలో భారతదేశం.. ప్రపంచంలో మొదటిస్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో.. జీరో బ్యాలెన్స్ అకౌంట్​లు ఓపెన్​ చేయించిన ఘనత మోదీదని బండి సంజయ్​ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details