తెలంగాణ

telangana

Bandi Sanjay on Chandrababu Arrest

ETV Bharat / videos

Bandi Sanjay on Chandrababu Arrest : 'అరెస్టుతో చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ వచ్చింది' - చంద్రబాబు అరెస్టుపై కిషన్​రెడ్డి

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 12:51 PM IST

Bandi Sanjay on Chandrababu Arrest :స్కిల్ డెవలప్​మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Naidu)కి పలు పార్టీల నేతలు మద్దతిస్తున్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్(BJP National Secretary Bandi Sanjay) చంద్రబాబు అరెస్టుపై మరోసారి స్పందించారు. బాబు అరెస్టు రాజకీయ కక్షతోనే అని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఏపీలో వైసీపీ నేతలకు ఓ దురలవాటు ఉందని.. తప్పును తప్పు అని చెబితే చంద్రబాబు ఏజెంట్లు అని అంటారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.  

Bandi Sanjay Comments on YCP Govt : తప్పు చేస్తే అరెస్టు చేయడం తప్పు కాదు. దాన్ని ఎవరూ కాదనరు.. తప్పు పట్టరు కూడా. కానీ ఎఫ్​ఐఆర్​లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారో నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు అరెస్టు అక్రమం. అది ప్రజలకు కూడా తెలిసిపోయింది. అందుకే ఏపీలో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరాగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సమావేశాలు(G-20 Summit) జరుగుతున్న సమయంలోనే చంద్రబాబును అరెస్టు చేసేందుకు సమయం కుదిరిందా. దీనివల్ల జగన్ సర్కార్​కే నష్టం. ఇప్పుడు చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ పెరిగింది. అని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay On Kishan Reddy Strike :  మరోవైపు నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని బండి సంజయ్ ఖండించారు. ఓ కేంద్ర మంత్రితో పోలీసులు ప్రవర్తించిన తీరును ఆయన తప్పుబట్టారు. నిరుద్యోగ సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details