Bandi Sanjay Family Meet PM Modi : మోదీని కలిసిన బండి.. 'దేశ్ కీ నేతగా అయ్యావని అభినందనలు' - బండి సంజయ్ వార్తలు
BJP Leader Bandi Sanjay Meet PM Narendra Modi : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్‌ను అభినందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగడంతో పాటు వారి యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ తమ వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రధానితో ఉన్న ప్రతి క్షణం మా కుటుంబానికి ఇచ్చిన జీవితకాల బహుమతిగా కొనియాడారు. ఈ సందర్భంగా సంజయ్ ప్రధాని మోదీని కలిసిన ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం మా కుటుంబానికి మరవలేని తీపి జ్ఞాపకాలని ట్వీట్ చేశారు.