Bandi Sanjay Fires On Telangana Government : గవర్నర్ రబ్బర్ స్టాంపుగా ఉండాలని బీఆర్ఎస్ కోరుకుంటోంది: బండి సంజయ్ - గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు
Published : Sep 26, 2023, 5:10 PM IST
Bandi Sanjay Fires On Telangana Government : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజ్ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) తిరస్కరించడం ముమ్మాటికీ సరైన నిర్ణయమేనని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. గవర్నర్ తన విచక్షణాధికారులను ఉపయోగించి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం(KCR Government) గవర్నర్ రబ్బర్ స్టాంప్‌గా ఉండాలనుకుంటోందని ఆరోపించారు. సర్కార్ పంపిన ఫైళ్లన్నీ చూడకుండా సంతకం పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తే ఆమెకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని అన్నారు. ఇది సరైన పద్దతి కాదని.. వాళ్లకు నచ్చినట్లు లేకుంటే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
Bandi Sanjay on Ganesh Nimajjanam 2023 :కరీంనగర్లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను బండి సంజయ్ పరిశీలించి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి చేతులు దులుపు కున్నారని దుయ్యబట్టారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉందని.. మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. వినాయక విగ్రహాలన్నీ టవర్ సర్కిల్ వద్దకు రాకుండా వెళ్లాలంటూ బెదిరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నిమజ్జనం(Nimajjanam) సందర్భంగా ఏదైనా జరగరానిది జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు.