తెలంగాణ

telangana

Bandi Sanjay Fires on BRS

ETV Bharat / videos

Bandi Sanjay Fires on BRS : ఒక వర్గానికే కొమ్ము కాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బండి సంజయ్ - Bandi Sanjay Bhumipooja

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 4:49 PM IST

Bandi Sanjay Fires on BRS : అధికార బీఆర్​ఎస్​ పార్టీ హిందూ మనోభావాలను దెబ్బ తీస్తూ ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కచ్చితంగా మందలిస్తామని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్ శివారులో ఓ వర్గం వారికి ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించడంపై తప్పు పట్టారు. సదరు వర్గానికి ప్రభుత్వం కేటాయించిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

Bandi Sanjay in Karimnagar Today : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న హిందూ దేవాలయాలను పట్టించుకోకుండా.. ప్రభుత్వము కేవలం ఒకరికి మాత్రమే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్​లో గురుద్వార్, మేదరి సంఘం కమ్యూనిటీ భవనాన నిర్మాణానికి భూమి పూజ చేశారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తే కచ్చితంగా మాట్లాడవలసి తీరుతుందని, తగిన గుణపాఠం చెబుతామని అధికార పార్టీ నాయకులను హెచ్చరించారు 

ABOUT THE AUTHOR

...view details