తెలంగాణ

telangana

Bandi Sanjay Election Campaign 2023

ETV Bharat / videos

కేసీఆర్​ మరోసారి సీఎం అయితే ఆర్టీసీ ఆస్తులను అమ్మేస్తారు : బండి సంజయ్​

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 2:54 PM IST

Bandi Sanjay Election Campaign In Karimnagar 2023  : పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న బీజేపీ.. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా అధికారం చేపడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా ముగ్దుంపూర్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ..గ్రామాలకు రహదారి వేయడానికి మోదీ ప్రభుత్వం నిధులిచ్చిందని ​ అన్నారు. రైతువేదికలకు, కమ్యూనిటీ భవనాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే కేసీఆర్​ తానే ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

Bandi Sanjay Comments on KCR : దళితబంధు, బీసీబంధు కోసం కొట్లాడితే పోలీసులు కేసులు పెడుతున్నారని సంజయ్​ ఆరోపించారు. కేసీఆర్​ మరోసారి అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులను అమ్మేస్తారని లేదా బినామీ పేర్లమీద మార్చుకుంటారని​ తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలకు న్యాయం చేయాలనే ఆలోచన కేసీఆర్​కు లేదని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలన్నా.. ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా ప్రజలు బీజేపీని తప్పకుండా గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details