తెలంగాణ

telangana

Bandi Sanjay Demanding Recounting

ETV Bharat / videos

Bandi Sanjay Demanding Recounting In Karimnagar : కరీంనగర్​ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత - సంజయ్ రీకౌంటింగ్​ డిమాండ్

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 6:35 PM IST

Bandi Sanjay Demanding Recounting In Karimnagar : కరీంనగర్‌ నియోజకవర్గ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ మీద గంగుల కమలాకర్​ స్వల్ప ఆధిక్యంలో గెలుపొందారు. 300కు పైగా ఓట్ల తేడాతో బీఆర్​ఎస్​ నుంచి గంగుల కమలాకర్‌ విజయకేతనం ఎగరవేయగా, ఈ ఫలితంపై సంతృప్తి చెందని బండి సంజయ్ మరల కౌంటింగ్​ జరపాలని బండి సంజయ్ ఈసీని కోరారు. కార్యకర్తలు అందరూ ఆయనతో పాటు రాగా  కౌంటింగ్ కేంద్రం కిక్కిరిసిపోయింది. ఓవైపు గెలిచిన గంగుల తరపు అనుచరులు, మరోవైపు బీజేపీ కార్యకర్తల నినాదాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద గుమికూడిన వారిని పోలీసులు లాఠీ ఛార్జ్​ చేసి అడ్డుకున్నారు.

Bandi Demanding Recounting Of Karimnagar Constituency :మరోసారి రీకౌంటింగ్ ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతానికి బండి సంజయ్​పై గంగుల 3,284 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే మొరాయించిన 2 ఈవీఎంలను కూడా ఈసీ లెక్కించలేదు. అందులో 1300 ఓట్లు ఉన్నాయి. దీనివల్ల రీకౌంటింగ్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details