'హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని అడ్డుకున్న వ్యక్తి ఆలె నరేంద్ర' - telangana latest news
Bandi Sanjay Tribute to Ale Narendra : హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని అడ్డుకొని.. పాత బస్తీ ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి ఆలె నరేంద్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆలె నరేంద్ర వర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆలె నరేంద్ర చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఆకాంక్షించిన వ్యక్తి నరేంద్ర అని పేర్కొన్న బండి సంజయ్.. 1975లో ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి బీజేపీ నాయకులకు, నేతలకు, యువతకు ఎల్లప్పుడూ ఆదర్శం అన్నారు. ఇలాంటి గొప్ప వీరులు, నేతల చరిత్రను కచ్చితంగా పాఠ్యాంశాల్లో చేరుస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఆలె నరేంద్ర చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.