బీఆర్ఎస్ గెలిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేసే దమ్ముందా ? : బండి సంజయ్ - కాంగ్రెస్ బీఆర్ఎస్పైబండి సంజయ్ ఫైర్
Published : Nov 7, 2023, 12:10 PM IST
Bandi Sanjay Comments on BRS : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని.. బీజేపీ నేతలు పోరాటాలు చేసి జైలుకు వెళ్లారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది నిరుద్యోగులంతా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పుల రాజ్యంగా మార్చారని విమర్శించారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినవని చెప్పారు. రామరాజ్యం కావాలా..? లేదా రజాకార్ల రాజ్యం కావాలా ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. రామరాజ్యం కావాలంటే బీజేపీ ఓటు వేయాలని కోరారు.