తెలంగాణ

telangana

Bandi Sanjay Bike Rally In Vemulawada

ETV Bharat / videos

Bandi Sanjay Bike Rally In Vemulawada : 'బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది​' - బండి సంజయ్​ వర్సెస్​ కేసీఆర్​

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 7:28 PM IST

Bandi Sanjay Bike Rally In Vemulawada : సీఎం కేసీఆర్​ పంపిన బిల్లులపై న్యాయ సలహాలను గవర్నర్​ కోరుతున్నారు కాబట్టే గవర్నర్​ అంటే కేసీఆర్​కు భయం పట్టుకుందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్​ విమర్శించారు. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులను మోసం చేసేందుకు కేసీఆర్​.. ఆ లోపాలను సరిచేసేందుకు గవర్నర్​ పూనుకున్నారని పేర్కొన్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత బండి సంజయ్​ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. 

కేసీఆర్​ రాక్షస పాలనతో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎంను తానే అవుతానంటూ ప్రచారం చేసుకోవడం సరికాదని హితవు పలికారు. అలాంటి వాళ్లంతా తన దృష్టిలో మూర్ఖులేనని అభిప్రాయపడ్డారు. కేసీఆర్​ రాక్షస పాలనను అంతం చేసి పేదల రాజ్యాన్ని స్థాపించడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని బండి పేర్కొన్నారు .

ABOUT THE AUTHOR

...view details