Bandi Sanjay America Tour : అమెరికాలో బండి సంజయ్‌కు ఘన స్వాగతం.. స్క్వేర్ బిల్ బోర్డులో ఎంపీ ఫొటో - బండి సంజయ్ అమెరికా పర్యటన
Published : Sep 2, 2023, 5:21 PM IST
Bandi Sanjay America Tour : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అట్లాంటాలో జరిగే ఆప్టా వార్షికోత్సవంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. తమ అభిమాన నాయకుడు అమెరికాలోని అట్లాంటాకు వచ్చిన సందర్భంగా స్టార్ హీరోల ప్రకటనలు, సినిమా ట్రైలర్‌లు మాత్రమే కనిపించే టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డులో బండి సంజయ్, నరేంద్ర మోదీ ఫొటోలు వేసి ప్రవాస భారతీయులు తమ అభిమానం చాటుకున్నారు.
Bandi Sanjay Visits America : యూఎస్ పర్యటనలో నార్త్ కరోలినా, వర్జీనియా, న్యూజెర్సీ, వాషిగ్టన్ డీసీ, డల్హాస్ రాష్ట్రాల్లో ఆత్మీయ సదస్సులు నిర్వహించనున్నామని, బండి సంజయ్‌ను కలుసుకోవడం కోసం తెలంగాణ ప్రవాసులు ఆత్రుతతో ఎదరు చూస్తున్నారని బిల్ బోర్డు ఏర్పాటుదారుడు విలాస్ రెడ్డి జంబుల తెలిపారు. ఈ పర్యటనలో బండి పలు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవా, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.