Rush at Balkampet yellamma temple : బల్కంపేట ఆలయ క్యూలైన్లలో భక్తుల తోపులాట - Balkampet Yellamma Temple Hyderabad
Balkampet yellamma temple : తెలంగాణ ప్రభత్వం ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్మించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. రద్దీకి తగినట్టుగా ఏర్పాటు చేయలేదంటూ భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఆలయం క్యూ లైన్లలో తోపులాట జరిగింది. అమ్మవారి కల్యాణోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి.. ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులను నియంత్రించటం కష్టంగా మారింది. పెద్ద ఎత్తున క్యూలైన్లు బారులు తీరగా.. అమ్మ వారిని దర్శించుకునే క్రమంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది.
ఈ క్రమంలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పిన వారికి తోటి భక్తులు సపర్యలు చేశారు. మహిళలు చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురైయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. క్యూలైన్లలో ఉన్న భక్తులను నియంత్రించారు. వీఐపీ పాస్‌లు ఎక్కువ ఇచ్చారని.. దీంతోనే ఈ పరిస్థితి నెలకొందని భక్తులు మండిపడుతున్నారు. సామాన్యలను పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు అధికంగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.