Balapur Ganesh Immersion Completed At Tank Bund : ముగిసిన బాలాపూర్ మహా గణపతి నిమజ్జనం - బాలాపూర్ గణేశ్ నిమజ్జనం
Published : Sep 28, 2023, 6:08 PM IST
Balapur Ganesh Immersion Completed At Tank Bund : హైదరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా సాగింది. 11 రోజులు ఘనంగా పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు. సాయంత్రం 5 గంటలకు బాలాపూర్ మహా గణపతి నిమజ్జనం పూర్తైంది. ఈ మహాగణపతిని ట్యాంక్‌బండ్ వద్ద 13వ నంబర్ క్రేన్‌పై ఉంచి నిమజ్జనం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి గణనాథుని శోభ యాత్రలో పాల్గొన్నారు.
బాలాపూర్ గణపతి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది లడ్డూ. ఉదయం లడ్డూ వేలంపాట అనంతరం లంబోదరుడు నిమజ్జన శోభ యాత్రకు బయలుదేరారు. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఓ చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే... వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వెయ్యి 116తో ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. లడ్డును దక్కించుకోవడానికి వేలంపాటలో పాల్గొన్నవారు పోటీ పడ్డారు. వేలంపాటలో ధర లక్షల్లోకి చేరింది. హోరాహోరీగా సాగిన వేలంలో దాసరి దయానంద్‌రెడ్డి 27 లక్షలకు లడ్డును దక్కించుకున్నారు.