TDP Balakrishna support for Varahi Yatra: పవన్ వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం: బాలకృష్ణ - bala krishna comments on roja
Published : Sep 30, 2023, 4:19 PM IST
Balakrishna declared full support for Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన నాలుగొ విడత ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అక్రమ కేసులకు తాము భయపడేది లేదని బాలకృష్ణ తేల్చిచెప్పారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని బాలకృష్ణ మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో స్పందన చూసి ఓర్వలేకపోయారని.. అందుకోసమే చంద్రబాబుపై స్కిల్ కేసులో.. రాజకీయ కక్షతోనే పెట్టారని బాలకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.