తాతలను ఆటపట్టించిన మనవళ్లు చంద్రబాబు బాలకృష్ణ ఎలా మురిసిపోయారో - Sankranti celebrations
Sankranti celebrations సంక్రాంతి పండుగ కోసం ఏపీలోని నారావారిపల్లెలో మూడు రోజులుగా ఉంటున్న బాలకృష్ణ, చంద్రబాబు మనువళ్లతో సరదాగా గడిపారు. మకర సంక్రాంతి రోజున సంప్రదాయాలను అనుసరిస్తూ తమ ఇంటి దేవత నాగాలమ్మ కట్ట వద్ద పూజలు నిర్వహించిన అనంతరం బాలకృష్ణ, చంద్రబాబును వారి మనువళ్లు ఆటపట్టించిన తీరు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు వద్దకు వచ్చిన దేవాన్షు తాతపై కూర్చొని గారాలు పోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరో తాత బాలకృష్ణను నీళ్ల సీసాతో సరాదాగా తలపై కొట్టడం నవ్వులు పూయించింది. బాలకృష్ణ సైతం దేవాన్షును ఆటపట్టించిన తీరు సరదాగా సాగింది. దేవాన్షుతో పాటు బాలకృష్ణ చిన్న కూతురైన తేజస్వినీ కుమారుడు ఆర్యవీర్ అటు చంద్రబాబుతోనూ, ఇటు బాలకృష్ణతోనూ సరదా సరదాగా తన ఆటలు సాగించాడు.