రెండు కేజీల బాహుబలి కజ్జికాయ తినే పోటీ.. ఎంత మంది తిన్నారంటే? - కజ్జికాయను తినలేకపోతున్న మహిళా కస్టమర్లు
హోలీ అంటేనే అందరికి గుర్తొచ్చేది రంగులు. ప్రతి ఒక్కరి జీవితం రంగులలా అందంగా ఉండాలనే దానికి ప్రతీక హోలీ. ఈరోజు కేవలం రంగులే కాదు ఆనందానికి గుర్తుగా పంచుకునే స్వీట్లు కూడా చాలా ప్రత్యేకం. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో హోలీ సందర్భంగా కొత్త రకం స్వీట్‌ను తీసుకొచ్చాడు ఒక కిరాణా షాపు వ్యక్తి. హోలీ సందర్భంగా బాహుబలి కజ్జికాయను తయారు చేశాడు. దీని బరువు, ధర తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. 2కేజీల బరువున్న ఈ బాహుబలి కజ్జికాయ ధర రూ.6000. అయితే హోలీ సందర్భంగా విశేషంగా ఉండాలని దుకాణాదారుడు కజ్జికాయను తినే పోటీని నిర్వహించాడు. చూడటానికి అందంగా, రుచికరంగా, ప్రత్యేకంగా ఉన్న కజ్జికాయను తినడానికి పెద్ద సంఖ్యలో కస్టమర్లు దుకాణానికి చేరుకున్నారు. 14 అంగుళాల బాహుబలి కజ్జికాయను తినడానికి చాలా మంది మహిళలు దుకాణానికి వచ్చారు. కానీ అంత పెద్ద కజ్జికాయను ఎవరూ పూర్తిగా తినలేకపోయారు. సగం కంటే తక్కువే తిని అంతా చేతులెత్తేశారు.