తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం.. భారీగా హాజరైన జనం - చార్ధామ్ యాత్ర 2022
Badrinath temple opening: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. ఆదివారం ఉదయం 6.15 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయం తలుపులు తెరిచాక.. బద్రీనాథుడికి తాపడంగా చేసిన నెయ్యిని పంచిపెట్టారు. బద్రీనాథుడి ఆలయంతో పాటు సుభాయ్ గ్రామంలోని భవిష్య బద్రి ధామ్ ఆలయ తలుపులు తెరిచారు. కుబేరుడి డోలీ శనివారం రాత్రి బామణి గ్రామానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 5 గంటలకు బద్రీనాథుడి ఆలయానికి తీసుకొచ్చారు. బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్, ఉపాధ్యక్షుడు కిశోర్ పన్వార్, మాజీ ఎమ్మెల్యే మహేంద్ర భట్ సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు. చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈనెల 3వ తేదీన, కేదార్నాథ్ ఆలయం ఈనెల 6వ తేదీనే తెరుచుకున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST