స్కూల్ ఆవరణలో పిల్ల ఏనుగు హల్చల్.. దారి తప్పి..! - తల్లి నుంచి తప్పిపోయిన గజరాజు
కర్ణాటక చామరాజనగర్ సమీపంలోని యలందూర్లో ఓ పిల్ల ఏనుగు హల్చల్ చేసింది. పూరానిపోద్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులు, గ్రామస్థులతో సరదాగా గడిపింది. తల్లి నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు.. గ్రామస్థులు పెట్టిన పాలు తాగింది. అలాగే విద్యార్థులు పెట్టిన అరటి పళ్లు తిని హుషారుగా స్కూల్ ఆవరణలో తిరిగింది. కాసేపటి తర్వాత గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఏనుగు పిల్లను తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST