బాబు మోహన్‌కు భారీ షాక్ - బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కుమారుడు ఉదయ్ మోహన్ - ఉదయ్ మోహన్ ఏ పార్టీలో చేరారు
Published : Nov 19, 2023, 1:39 PM IST
Babu Mohan son Uday Mohan joined BRS : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారటం పరిపాటిగా మారింది. తమ ఆశయాలకు అనుకూలంగా ఉండే పార్టీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత బాబు మోహన్ కుమారుడు ఆ లిస్టులోకి చేరారు. సంగారెడ్డి జిల్లా ఆంధోల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్(Babu Mohan)కు భారీ షాక్ తగిలింది. ఆయన కుమారుడు ఉదయ్ మోహన్ సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు.
Telangana Assembly Elections 2023 : ఉదయ్ మోహన్(Uday Mohan)కు మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో బాబుమోహన్ వ్యవహార శైలి నచ్చకే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయ్ మోహన్‌తో పాటు ఆంధోల్లోని పలువురు ముఖ్య నాయకులూ బీఆర్ఎస్లో చేరారు. బీజేపీలో ఉండి దామోదర్‌కు సపోర్ట్ చేయమని బాబు మోహన్ చెప్పడాన్ని జీర్ణించుకోలేక పోయామని క్యాడర్ తెలిపారు.