తెలంగాణ

telangana

BJP Candidate Babu Mohan Fire on BRS

ETV Bharat / videos

ఎన్నికల కోసం నన్ను నా కొడుకును విడదీశారు - బాబు మోహన్‌ కన్నీటి పర్యంతం - babu mohan emotional at campaign

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 2:01 PM IST

Babu Mohan Cries in Election Campaign Video :తండ్రి, కుమారుడిని విడదీసి ఎన్నికల్లో గెలిచేందుకు మంత్రి హరీశ్‌ రావు కుట్ర చేశారని అందోల్‌ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సంగారెడ్డి జిల్లా రాయికోడు గ్రామంలో ఆయన పర్యటించారు. మంత్రి హరీశ్‌ రావు తన కుటుంబంలో చిచ్చుపెట్టి.. తన కుమారుడైనా ఉదయ్‌ భాస్కర్‌ను దూరం చేశారంటూ బాబు మోహన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు.. తన కుమారుడు ఉదయ్ భాస్కర్‌తో డబ్బులు పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. 

తన పేరును దుర్వినియోగం చేసేలా బీఆర్​ఎస్​ ప్రయత్నాలు చేస్తోందని.. అలా చేయవచ్చా అని బాబు మోహన్‌ ప్రశ్నించారు. తన కుమారుడిని బీఆర్​ఎస్​ పార్టీలో చేర్చుకొని.. ఉదయ్‌ భాస్కర్‌ పేరును ఉదయ్ బాబు మోహన్​గా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా గులాబీ పార్టీలో చేరుతానని.. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details