భద్రాద్రికి చేరిన 'అయోధ్య' తలంబురాలు - ప్రతి హిందువుకు పంపిణీ - భద్రాద్రిలో అయోధ్య తాళంబురాలు ప్రత్యేక పూజలు
Published : Dec 8, 2023, 2:08 PM IST
Ayodhya Talambralu Reached Bhadradri : అయోధ్య రామయ్య సన్నిధిలో పూజలు నిర్వహించిన గోటి తలంబ్రాలు భద్రాద్రి రామయ్య మందిరానికి చేరుకున్నాయి. భారతదేశంలోని ప్రతి హిందువుకు అయోధ్య తలంబ్రాలు చేరాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి నుంచి వచ్చిన తలంబ్రాలను భద్రాచలంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం తలంబ్రాలకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిని హైదరాబాద్కు పంపిస్తామని తెలిపారు.
తలంబ్రాల రాకతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. జనవరి 22న అయోధ్య మందిరంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన ఈ తలంబ్రాలను భక్తులందరికీ పంపిణీ చేస్తామని విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు తెలిపారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. భారతదేశ ప్రజలు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలని కోరారు.