Viveka Murder Case: సీబీఐ ముందుకు హాజరైన అవినాష్ రెడ్డి.. 7 గంటల పాటు కొనసాగిన విచారణ
CBI investigation in Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ రోజు ఉదయం 9.40 నిమిషాల సమయంలో అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నాడు. 10.30 గంటల సమయంలో అవినాష్ విచారణ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు అవినాష్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మధ్యలో దాదాపు 30 నిమిషాల పాటు భోజన విరామ సమయం ఇచ్చారు. ఆ తర్వాత అవినాష్‌ను వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ప్రశ్నించారు.
అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే 8వ నిందితుడిగా చేర్చారు. వివేకా హత్య కేసులో తండ్రి కుమారుడి పాత్ర ఉందని సీబీఐ అధికారులు తేల్చారు. ఈ మేరకు వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు, హత్య గురించి ఎప్పుడు తెలిసింది. ఎవరు సమాచారమిచ్చారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. జూన్ 30వ తేదీ లోపు ప్రతి శనివారం సీబీఐ కార్యాలయంలో హాజరై విచారణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెండవ శనివారం కార్యాలయానికి వచ్చారు.