Auto Driver's Wife Got PhD: 'సెల్యూట్ టు షీలా..' కష్టాలు అధిగమించి.. పీహెచ్డీ సాధించిన గృహిణి - housewife with PhD
Published : Aug 30, 2023, 4:13 PM IST
Auto Driver's Wife Got PhD: ఏదైనా పని చేయాలంటే వాయిదాలు వేయడం నేటి తరం అలవాటు. రేపు చూద్దాంలే.. తర్వాత చేద్దాంలే.. అంటూ మర్చిపోతుంటారు. చేయాల్సిన పని వాయిదా వేస్తూ.. కాలాన్ని వృథా చేస్తుంటారు. కానీ, అతి కొద్ది మంది మాత్రమే కాలంతో పాటు అడుగులు వేస్తుంటారు. అలాంటి వారే విజయాన్ని అందుకుంటుంటారు. ఓ సాధారణ గృహిణి అసాధారణ విజయాన్ని అందుకుని ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
Eepuri Sheela Received PhD from Nagarjuna University: ఆమె చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి ప్రేమకు దూరమైంది. పేదరికం వల్ల ఇష్టమైన చదువును కొనసాగించలేకపోయింది. అయినా ఏనాడూ నిరాశ చెందలేదు. ఆటోడ్రైవర్ అయిన భర్త అన్ని రకాలుగా సహకరించడంతో తిరిగి తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. ఇంజినీరింగ్ చదివే బాబు, ఇంటర్ చదువుతున్న అమ్మాయి సంరక్షణ చూసుకుంటూ తను విద్యార్థిగా ముందుకు సాగింది. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత’ అనే అంశంపై షీలా చేసిన పరిశోధనకు గాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టాను గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. సాధించాలనే తపనకు తోడు పట్టుదల, నిరంతరం కష్టపడితే ఎలాంటి విజయమైనా దాసోహం కావాల్సిందే అంటున్న డాక్టరేట్ షీలా ఈపూరితో ఈటీవీ ముఖాముఖి.