Attack on Two People Viral Video : అమానుషం.. మేకను ఎత్తుకెళ్లారని దళిత యువకుడు, పశువుల కాపరిని తలకిందులుగా వేలాడదీసి దాడి - People attacked a Dalit in Mandamarri
Published : Sep 2, 2023, 9:49 PM IST
Attack on Two People Viral Video in Mandamarri :మేకను దొంగతనం చేశాడనే నెపంతో.. ఓ దళిత యువకుడు, పశువుల కాపరిని తలకిందులుగా వేలాడదీసి కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటుచేసుకుంది. మందమర్రి అంగడి బజార్ ప్రాంతంలో ఉండే కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్.. శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకలు పెంచుతున్నారు. 20 రోజుల క్రితం మంద నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది.
దీంతో పశువుల కాపరి తేజ, అతడి స్నేహితుడైన దళిత యువకుడు చిలుముల కిరణ్‌లు మేకను ఎత్తుకెళ్లారని అనుమానించిన రాములు కుటుంబం.. ఇద్దరిని షెడ్డు వద్దకు పిలిపించారు. ఈ క్రమంలోనే వారిని కొట్టానికి వేలాడ దీసి.. కింద పొగ పెట్టి తీవ్రంగా కొట్టి (Two People Beaten Suspicion of Stealing Goat) వదిలేశారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కిరణ్ రాత్రి ఇంటికి రాకపోవడంతో.. బాధితుడి అక్క ఆందోళన చెందింది. కిరణ్‌ను కొట్టిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, ఎస్సై చంద్రకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.