మద్యం మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు - Attacks on petrol station staff in Telangana
Attack on petrol bunk workers at bahadhurpally: రాత్రివేళలో పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడులు ఆందోళన కల్గిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఘటన మరువకముందే మరో దాడి ఘటన చోటుచేసుకుంది. దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధి బహదూర్‌పల్లిలోని శ్రీ సిద్ది వినాయక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిపై శనివారం రాత్రి పది గంటల సమయంలో ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనం (TS08 HQ 5721) పై వచ్చిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నారు.
పెట్రోల్ పంపు పనిచేయకపోవడంతో ఐదు నిమిషాలు ఆగమని బంకు సిబ్బంది చెప్పగా మమ్మల్ని ఆగమంటావా అని శ్రీకాంత్ (24), అనిల్ (18) ఇటుకలతో దాడి చేయగా బంక్ సిబ్బంది శ్రీకాంత్‌కి తల వెనకాల బలమైన గాయం అవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ముగ్గురిపై పెట్రోల్ బంక్ యజమాని రాములుగుట్ట స్థానిక దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.