ఎంపీపీ భర్తపై దాడి సీసీ కెమెరాలో ఘటన దృశ్యాలు - ఎంపీపీ భర్త సామ వెంకట్ రెడ్డిపై దాడి
Attack on MPP Husband నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో ఎంపీపీ భర్త సామ వెంకట్‌రెడ్డిపై దాడి జరిగింది. పాత కక్షలతో గడ్డం సంతోశ్, దిలీప్, సాయిరెడ్డి అనే ముగ్గురు యువకులు వెంకట్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఎంపీపీ భర్తను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST