నగల వ్యాపారిపై కాల్పులు కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నం - rajasthan jeweler owners attack
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో బుధవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు నగల వ్యాపారి రాజీవ్ వర్మపై కాల్పులు జరిపారు. దుండగుల దాడినుంచి ఎలాగోలా తప్పించుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యాపారి కారుకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేపట్టి తొందరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు సిటీ ఎస్పీ హర్బన్స్ సింగ్. మరోవైపు, రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఓషియన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగల వ్యాపారిని ఓ వ్యక్తి స్కార్పియోతో ఢీకొట్టాడు. నగల వ్యాపారి బైక్‌పై వెళ్తుండగా మధ్యలో ఓ చోట ఆగాడు. ఇది గమనించిన దుండగుడు కావాలనే అతనిని స్కార్పియోతో ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఇది గమనించిన వ్యాపారి తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే వాహనం ఢీకొనడం వల్ల ఒక్కసారిగా ఎగిరిపట్టాడు. ఈ ఘటనలో వ్యాపారి బైక్ ధ్వంసమైంది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST