తెలంగాణ

telangana

Attack on Forest Officer in adilabad

ETV Bharat / videos

Attack on Forest Officer in Adilabad : అటవీ అధికారిపై గొడ్డలితో దాడి చేసిన తండ్రీకుమారులు.. అదే కారణం! - ఆదిలాబాద్​లో అటవీ అధికారిపై దాడి

By

Published : Jul 28, 2023, 6:54 PM IST

Father and son attacked on Forest Officer in Adilabad : కారణం ఏదైనా అధికారులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అధికారులకు గాయాలు అవుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో మృతి చెందే పరిస్థితులూ ఏర్పడుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్​ జిల్లాలోని అటవీ భూమిలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ అధికారిపై తండ్రీకుమారులు దాడి చేశారు. ఈ దాడిలో అధికారి తలకు గాయాలయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం బుర్రసన్​ పటార్​ గ్రామ శివారులో ఉన్న అడవిలో ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​ నరసయ్య మొక్కలు నాటేందుకు కూలీలతో సహా వెళ్లాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సొన్​ కాంబ్లి, వికాస్​ బబ్లు అనే తండ్రీకుమారులు తాము సాగు చేసుకుంటున్న ఈ భూమికి అటవీ హక్కు పత్రం రాలేదని.. దానికి గల కారణం వచ్చిన అధికారే అనుకొని గొడ్డలితో దాడికి దిగారు. ఈ గొడవలో ఫారెస్ట్​ అధికారి తలకు దెబ్బలు తగిలాయి. ఈ విషయం చుట్టు పక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశగా మారింది.

ABOUT THE AUTHOR

...view details