తెలంగాణ

telangana

Latest Rajbhavan Programme

ETV Bharat / videos

AT Home Programme in Rajbhavan : రాజ్​భవన్​లో 'ఎట్​ హోం' కార్యక్రమం.. హాజరు​ కాని బీఆర్ఎస్​, కాంగ్రెస్​ - ఎట్​ హోం కార్యక్రమానికి హాజరు కాని కాంగ్రెస్​

By

Published : Aug 15, 2023, 10:21 PM IST

AT Home Programme in Rajbhavan : పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్​తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్​ఎస్​ నేతలెవరూ హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజా ప్రతినిధులు, నేతలు కూడా పాల్గొనలేదు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, స్వాతంత్య్ర సమరయోధులు, పలువురు ప్రముఖులు గవర్నర్ ఎట్ హోంకు హాజరయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details