అసర్ విద్యా నివేదిక 2023 - జీర్ణించుకోలేని అంశాలు, పాఠశాల విద్య బలోపేతం ఎలా?
Published : Jan 18, 2024, 10:08 PM IST
Aser Education Report 2023 : రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రమాణాలు, పరిస్థితుల డొల్లతనం ఏ స్థాయిలో ఉందో అసర్ నివేదిక మరోసారి చర్చకు పెట్టింది. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన వార్షిక స్థాయి విద్యా నివేదిక– అసర్-2023లో అనేక జీర్ణించుకోలేని అంశాలు వెల్లడయ్యాయి. పాఠశాల, కళాశాల నుంచి డ్రాపౌట్ అవుతున్న వారు ఒకవైపు, చదువుకుంటున్న వారిలోనూ దారుణ పరిస్థితుల్లో ఉన్న అభ్యసన సామర్థ్యాలు మరొకవైపు, మేధావులు, విద్యావేత్తల్ని నిట్టూర్చేలా చేస్తున్నాయి. రాష్ట్రంలో 14-16 వయసున్న విద్యార్థలు సైతం 2వ తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేని దుస్థితి ఉందని నివేదికలో పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా 17-18 ఏళ్ల మధ్య ఉన్న గ్రామీణప్రాంత యువతీయువకుల్లో 40 శాతం మంది చదువులు మానేస్తున్నారు. ఇందుకు కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైనా కసరత్తు జరిపిందా? వారితో పాటు డ్రాపౌట్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయాలి? చదువు తర్వాతేంటన్న ప్రశ్నలకైతే చాలామంది విద్యార్థుల వద్ద స్పష్టమైన సమాధానమే లేదు. ఈ పరిస్థితుల్లో మన పాఠశాల విద్య బలోపేతమెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.