తెలంగాణ

telangana

ETV Bharat / videos

అప్పటివరకు హుషారుగా డ్యాన్స్​.. ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. గుండె ఆగి... - పార్వతి వేషధారణలో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి

By

Published : Sep 8, 2022, 4:55 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

జమ్ముకశ్మీర్​లో గణేశ్ ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. జమ్ము జిల్లాలోని బిశ్నాలో జరిగిన గణేశ్ చతుర్థి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ యోగేశ్ గుప్తా(20) అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. యోగేశ్ పార్వతిదేవి వేషధారణలో ఉన్నాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల నృత్యం చేస్తూ స్టేజ్​పైనే పడిపోయాడు. ఈ విషయం తెలియని నిర్వహకులు, ఆడియన్స్ ఎవరూ కాసేపు యువకుడి దగ్గరకు వెళ్లలేదు. కాసేపటికి శివుని వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి యోగేశ్​ను లేపగా ఎంతకీ అతడు స్పందించలేదు. అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. యోగేశ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన బుధవారం జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details