సంగారెడ్డిలో రూ.3 కోట్ల విలువ గల గంజాయి పట్టివేత - సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ గంజాయి గురించి
Published : Nov 25, 2023, 5:41 PM IST
Around Rs. 3 crore worth Ganja seized at Sangareddy : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపిన వివరాల ప్రకారం. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో రెండు బొలెరో వాహనాలను తనిఖీ చేయగా.. దాదాపు రూ.3 కోట్ల విలువ గల ఎండు గంజాయి లభ్యమైంది. ఒక్కో బాక్సు 9 కిలోలు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వాహనంలో మొత్తం 70 బాక్సుల్లో 635 కిలోల ఎండు గంజాయి ఉందని చెప్పారు. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ను అదుపులో తీసుకున్నట్లు వివరించారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారని తెలిపారు. తమ యజమాని ఆదేశాల మేరకు ఒడిశాలోని జన్ భాయ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే త్రినాథ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు.