తెలంగాణ

telangana

రైతు కూలీలపై విరుచుకుపడ్డ ఏనుగు.. పంట పొలాలు నాశనం

ETV Bharat / videos

రైతు కూలీలపై విరుచుకుపడ్డ ఏనుగు.. భారీగా పంట నష్టం! - ఏనుగు దాడి తాజా

By

Published : May 27, 2023, 12:47 PM IST

తమిళనాడు మెగమలై అటవీ ప్రాంతంలో అరి కొంబన్‌ అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. స్థానికంగా టీ పంటను సాగుచేసే కార్మికులపై గజరాజు దాడికి యత్నించింది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకొని ఏనుగును బంధించేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. అనంతరం ఆ ఏనుగు కుడలూర్‌ ప్రాంతంలోని కొబ్బరి తోటలోకి ప్రవేశించి స్థానికులను భయ‌భ్రాంతులకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి ముందు ఉన్న ఓ వృద్ధురాలికి గజరాజు ఏ హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఏనుగు దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని అంచనా. 

గజరాజు సంచారంతో అటవీ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఎవరూ రోడ్డుపైకి రావద్దని హెచ్చరించారు. ఏనుగు మెడకు మానిటరింగ్‌ డివైజ్‌ (జీపీఎస్​) ఉండటం వల్ల దాని కదలికలను పసిగట్టడం అధికారులకు సులువుగా మారింది. ఆ ఏనుగు కేరళలోని మున్నార్‌లో జనావాసాలపై దాడికి దిగడం వల్ల దాన్ని కుంకీ ఏనుగు సాయంతో బంధించి తమిళనాడులోని పెరియార్‌ టైగర్‌ సాంచురీకి తీసుకొచ్చినట్లు అటవీ శాఖ అధికారులు వివరించారు. అంతకుముందు అటవీ శాఖ అధికారులు అరి కొంబన్​ కదలికలను కనిపెట్టేందుకు దాని మెడకు జీపీఆర్ఎస్ పరికరాన్ని అమర్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఏనుగు సంచరిస్తున్న ప్రదేశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. కాగా, ఏనుగును బంధించి తిరిగి అడవిలోకి విడిచిపెట్టేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details