YS SHARMILA: పని లేకపోతే గాడిదలు కాస్కోండన్న షర్మిల.. అదే చేస్తున్నామంటూ పోలీసుల కౌంటర్
YS sharmila house arrest: వైఎస్ షర్మిలను పోలీసులు గృహనిర్భందం చేశారు. దీంతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు గ్రూప్-1 పేపర్ లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తును ప్రశ్నించేందుకు వైఎస్ షర్మిల ఇంటి నుంచి బయటకి వస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆమెకు వాగ్వాదం జరిగింది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. పోలీసులను షర్మిల ప్రశ్నించింది. ఆమె ఇంటి ముందు ఇంత మంది పోలీసులు ఎందుకు ఉన్నారని అడిగారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌తో పాటు, మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. ఆమె అక్కడే నిరసనకు దిగింది. ఈ సందర్భంలోనే పోలీసులకు ఏం పనిలేదా.. పని లేకపోతే వెళ్లి గాడిదలు కాసుకోండి అని కౌంటర్ వేశారు. దీనికి బదులుగా పోలీసులు మేము అదే పనే చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. కాసేపటి తరువాత షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. షర్మిలను చూసేందుకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.