No Confidence Motion Against Chairman Vijayalakshmi : సమావేశంలో కంటతడి పెట్టుకున్న ఛైర్మన్ - చైర్మన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం
No Confidence Motion Against Municipal Chairman Vijayalakshmi : సంగారెడ్డి పురపాలక కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కొద్ది నెలల క్రితం సంగారెడ్డి పురపాలక ఛైర్మన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సొంత పార్టీ కౌన్సిలర్లు మరోసారి ఆమెకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఛైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడటంతో పాటు కబ్జాలు చేస్తున్నారని, తమ బంధువులను పురపాలక ఉద్యోగాల్లో అక్రమంగా నియమించి.. పని చేయకపోయినా జీతాలు చెల్లిస్తున్నారని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. అవినీతి ఛైర్మన్ గద్దె దిగాలని.. ఛైర్మన్ బంధువులకు ఉద్యోగాలు ఇచ్చిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్లకార్డులతో కౌన్సిలర్లు సమావేశానికి ర్యాలీగా వచ్చారు.
అనంతరం సమావేశంలో ఛైర్మన్‌పై ఆరోపణలు చేశారు. ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. సభ్యులు, చైర్మన్ సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అధికారులు ఎంత నచ్చచెప్పినా.. వివాదం సద్దుమనగ లేదు. సభ్యులు ఆరోపణలకు చైర్మన్ విజయలక్ష్మీ కంట తడి పెట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఇలా ఒకరిపై మరోకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశమైంది.